24-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే రామారావు పటేల్
నిర్మల్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): భార త రాజ్యాంగం రచించిన అంబేద్కర్‌ను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ వివరి స్తుందని అటువంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్పాలని బీజేపీ ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలో బీజేపీ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితే ష్ రాథోడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఆశల సాధనకు కృషి చేస్తుందని గుర్తు చేశా రు.
మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యం, 370 ఆర్టికల్ రద్దు, దేశ భద్రత ప్రజాస్వామ్య పరిరక్షణ, వ్యవసాయ అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని దీన్ని ప్రజల్లోకి బీజేపీ నాయకులు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రావుల రామ్‌నాథ్, రాజు, రాచకొండ సాగర్, అలివేలు ఉన్నారు.