calender_icon.png 3 October, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దనాన్న వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య...

03-10-2025 10:15:09 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): సొంత పెద్దనాన్న వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లి, పోచమ్మ గడ్డకు చెందిన అనురాధ తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి నివాసముంటుంది. కొన్నాళ్ళ క్రితం అనురాధ భర్త మృతి చెందాడు. అప్పటి నుండి అనురాధ బావ శ్రీను వారిని ఎలాగైనా బయటికి పంపించాలని హింసించేవాడు.

గురువారం అనురాధ ఇంట్లో లేని సమయంలో తన పెద్ద కూతురుపై శ్రీను చేసిన దౌర్జన్యాన్ని భరించలేక, తన తండ్రి మరణించిన తరువాత అతనికి రావాల్సిన డబ్బు, అనురాధ నివాసం ఉంటున్న ఇంటి కోసం సొంత పెద్దనాన్న అందరి ముందు అవమానించడంతో పెద్ద కూతురు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన తల్లి అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.