08-10-2025 08:06:08 PM
అక్రమ టేకు కలప స్వాధీనం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సిరికొండ మండల కేంద్రంలో ఉట్నూర్ ఎఫ్.డి.ఓ రేవంత్ చంద్ర సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చోట టేకు కల్ప చెక్కలు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకొని, అక్రమంగా కల్పను నిల్వ ఉంచిన సంబంధిత వ్యక్తులపై విచారణ చేపడుతున్నారు. ఈ దాడిలో ఎఫ్.ఎస్.ఓ చంద్రా రెడ్డి, సత్తయ్యా ఎఫ్.బి.ఓ సంతోష్, భీమ్‌జీ, హీరాలాల్, రమేష్ నిరంజన్, మారుతి పాల్గొన్నారు.