02-07-2025 12:56:52 AM
భూ వివాదంలో ఉత్సాహం చూపుతున్న పోలీసులు
న్యాయం జరగ కుంటే ఆత్మహత్యలే శరణ్యం అంటున్న బాధితులు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1, (విజయ క్రాంతి) దగ్గరి బంధువే కదా అని దయ తల చి భూమి కౌలుకు ఇస్తే తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి, రాజకీయ, పోలీస్ అండదండలతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నా రని బాధితులు లబోదిబోమ్ అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మం డల పరిధిలోని బండ్లగొండ గ్రామంలో ఆ రు ఎకరాల భూవివాదం ఆత్మహత్యల వర కు దారితీసింది.
నోటి మాటతో కౌలుకి ఇవ్వ డం తాము చేసిన తప్పిదం అంటూ బాధితులు బోరుణ విలపిస్తున్నారు. బాధితులు డోలి నాగరాజు, నాగభూషణంల కథనం ప్ర కారం మండల పరిధిలోని బండ్రుగొండ ఆ గ్రామానికి చెందిన రామస్వామి కుటుంబం ఆరు ఎకరాల సాగు చేసుకుంటున్నారు. వా ళ్ల తదనంతరం రామస్వామి ముగ్గురు కూ తుళ్లకు తలా రెండు ఎకరాల చొప్పున పంపి ణీ చేయడం జరిగింది.
భద్రమ్మ, అలివేలు, సక్కుబాయి అనువారు తల రెండు ఎకరాలు తీసుకొని సేద్యం చేస్తున్నారు. వారిలో సక్కుబాయి తన అవసర నిమిత్తం అదే గ్రామాని కి చెందిన డోలి శ్రీహరి కి విక్రయించడం జరిగింది. విక్రయించే సమయంలో మళ్లీ వా ళ్లు అమ్మే పరిస్థితి వస్తే తిరిగి తామే కొనుగోలు చేసుకునే ఒప్పందంపై 2008లో విక్రయించారు. కొనుగోలు చేసిన శ్రీహరి ఆ భూమికి ఆనుకునే ఉన్న భద్రమ్మ ,అలివేలు కు చెందిన నాలుగు ఎకరాలను సైతం కౌలు తీసుకొని సాగు చేపట్టాడు. శ్రీహరి మరణానంతరం అతని తోడల్లుడైన నల్లెల వెంకట య్య కౌలు తీసుకొని జామాయిల్ సాగు చే స్తున్నాడు.
ఈ క్రమంలో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించటం తో అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. సర్వే చేపట్టేనా క్రమంలో కవులు దారి అయి న వెంకటయ్య, హక్కు దారుల (భద్రమ్మ, అలివేలు) మధ్య వివాదం తలెత్తిందనీ తెలిపారు. ఈ క్రమంలో గ్రామంలో పంచాయ తీ నిర్వహించి ఇరుపక్షాలను డాక్యుమెంట్స్ తీసుకురావాలని పెద్దమనుషులు కోరడంతో వెంకటయ్య కొంత వ్యవధి కావాలని సమయం తీసుకున్నాడనీ. తీసుకున్న సమయంలోనే రాజకీయ నాయకుల అండదం డతో తప్పుడు దృవీకరణ పత్రాలను తయారు చేసినట్లు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో జరిగిన వివాదంలో ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషను ఆశ్రయించారు. ఈ క్రమం లో అలివేలు ఇటీవల పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు.పోలీసులు అతి ఉత్సాహం కనపరుస్తూ అర్హత లేని, తప్పుడు దృవీకరణ పత్రాలు చూపుతున్న వెంకటయ్యకు వత్తాసు పలుకుతూ తమకు తీరని అన్యాయం చేస్తున్నార ని, భూమి మీద నుంచి మీరు వెళ్లిపో వాలంటూ తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరగ కుం టే ఆత్మహత్యలే శరణ్యమని వారు తేల్చి చెప్తున్నారు.
రాజకీయ నాయకుల అండదండ తోనే పోలీసులు తమపై బెదిరింపులకు పా ల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. జి ల్లా పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. మంగళవారం బాధితులు పా ల్వంచ డిఎస్పి సతీష్ కుమార్ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. వాస్తవంగా భూ వివాదాలు తలెత్తితే పోలీసులు ఎలాంటి జో క్యం చేసుకోరాదని స్పష్టమైన ఆదేశాలు ఉ న్నతాధికారుల నుంచి ఉన్నాయి. అయినా పాల్వంచ రూరల్ ఎస్త్స్ర బండ్రుగొండ భూ వివాదంలో ఉత్సాహం చెబుతున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.
ఈ విషయమై పాల్వంచ రూరల్ ఎస్త్స్ర సురేషు ను వివరణ కోరగా జామాయిల్ కర్రను తోలకుండా నిలుపుదల చేయాలనే వారు నన్ను ఆశ్రయించారని తెలిపారు. భూ వివాదం ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవాల్సిందే తప్ప తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. జా మాయిల్ కర్ర ఆపే హక్కు తనకు లేదన్నారు.