పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీలు
22-08-2026 01:53 AM
- తాళం వేసిన ఇళ్లే టార్గెట్
- పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ
- 25 తులాల బంగారం, 182 తులాల వెండి స్వాధీనం
నాగర్ కర్నూల్, ఆగస్టు 21 ( విజయక్రాంతి) : తాళం వేసిన ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. శాయిన్పల్లికి చెందిన కసరి శివకుమార్ (23) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ మద్యం, జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు.
శాయిన్పల్లిలో 5, మమ్మాయిపల్లిలో 2 ఇళ్లలో మొత్తం 7 చోరీలు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 25.1 తులాల బంగారం, 182 తులాల వెండి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేటప్పుడు పొరుగువారికి, బీట్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. ఇంట్లో బంగారం, వెండి, నగదు ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు.






