calender_icon.png 23 October, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియా జైత్రయాత్ర

23-10-2025 01:01:23 AM

ఇండోర్, అక్టోబర్ 22 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా సెమీస్ చేరిన కంగారూలు తాజాగా ఇంగ్లాండ్‌ను చిత్తు చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 244/9 స్కోర్ చేసింది. బేమౌంట్ (78) రన్స్‌తో రాణిస్తే.. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 3/60, సోఫీ 2/52,గార్డనర్ 2/39 అదరగొట్టారు.

ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సదర్లాండ్ (98), గార్డనర్(104) దుమ్మురేపారు. ఐదో వికెట్‌కు 180 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. దీంతో ఆసీ స్ 40.3 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది. సౌతాఫ్రికా 10 పాయింట్లతో రెండో స్థానంలోనూ, ఇం గ్లాండ్ 9 పాయింట్లతో మూడో ప్లేస్‌లోనూ కొనసాగుతున్నాయి.