23-10-2025 01:02:44 AM
-నేడు కివీస్‌తో భారత్ డూ ఆర్ డై
-మహిళల వన్డే ప్రపంచకప్
-వరుస ఓటములతో ఒత్తిడిలో భారత్
నవీ ముంబై, అక్టోబర్ 21: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత వరుసగా రెండు విజయాలతో ఆశలు రేకెత్తించిన భారత జట్టు ఇప్పుడు టోర్నీ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడింది. గెలిచే మ్యాచ్‌లు చేజార్చుకుని వరుసగా హ్యాట్రిక్ ఓటములతో ఇప్పుడు న్యూజిలాండ్‌తో చావోరేవో పోరుకు సిద్దమైంది. నవీ ముంబై వేదికగా గురువారం కీలకపోరులో తలపడబోతోంది. నిజానికి గత మూడు మ్యాచ్ లోనూ భారత్ గెలిచేవే. చివర్లో ఒత్తిడిలోనై, పేలవ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లకు తలవంచింది.
ప్రస్తుతం భారత మహిళల జట్టు రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. ఇక మిగిలిన ఒకే ఒక బెర్త్ కోసం భారత్, కివీస్, శ్రీలంక రేసులో నిలిచాయి.మిగిలిన రెండు జట్ల కంటే రన్‌రేట్ విషయంలో మెరుగ్గా ఉండడం భారత్‌కు కాస్త రిలీఫ్‌గా చెప్పాలి. అయితే కివీస్‌తో మ్యాచ్ ఒకవిధంగా హర్మన్ ప్రీత్ అండ్ కోకు క్వార్టర్ ఫైనల్‌గా చెప్పొచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు దాదాపుగా చేరినట్టే. తర్వాత బంగ్లాపై గెలు పు పెద్ద కష్టం కాదు. ఒకవేళ కివీస్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ మెగా టోర్నీలో భారత్ తుది జట్టు కూర్పే చాలా ఇబ్బందిగా మారింది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడంతో రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ఆరో బౌలర్ ఆప్షన్ కోసం జెమీమాను జట్టు నుంచి తప్పించారు. ఈ వ్యూహం బాగానే పనిచేసి ఇంగ్లాండ్‌ను కట్టడి చేసినప్పటకీ ఛేజింగ్‌లో చేతులెత్తేసింది. దీంతో కివీస్‌పై జెమీమాను ఆడస్తారా లేక ఇంగ్లాండ్‌పై జట్టునే కొనసాగిస్తారా అనేది చూడాలి. డెత్ ఓవర్లలో బౌలిం గ్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం కనిపిస్తోంది.బ్యాటింగ్‌లో స్మృతి, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ ఫామ్ జట్టుకు అడ్వాంటేజ్. మరోవైపు న్యూజిలాండ్‌ది కూడా చావోరేవో పరి స్థితే. తొలి రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన కివీస్ తర్వాత బంగ్లాదేశ్‌పై గెలిచింది. అయితే శ్రీలంక, పాకిస్థాన్ జట్లతో మ్యాచ్‌లు వర్షంతో రద్దవగా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. దీంతో సెమీస్ చేరాలంటే భారత్‌పై విజయం ఆ జట్టుకు కూడా తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో భారత్, కివీస్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్‌కు ఆతిథ్య మిస్తున్న నవీ ముంబై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా.