23-10-2025 12:52:28 AM
తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వంటి ప్రయోజనాలు మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు ఇప్పటివరకు అందడంలేదని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపా రు.
ఇప్పటి వరకు దాదాపు 40 మంది ఉపాధ్యాయులు వివిధ కారణాలతో మరణించారని, వీరిలో ఒక్కరికి కూడా గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలు అందలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల కుటుంబాలకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామలీ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.