17-09-2025 06:04:06 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సోమిని వెళ్లే రహదారి బురదమయంగా కావడంతో ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో రోడ్డుకు మరమ్మత్తులు చేశారు.గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి అంతా బురదమైందా కావడంతో అధికారులకు చెప్పిన నాయకులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో ప్రతినిత్యం వెళ్లే ఆటో డ్రైవర్లు ఆటోలు చెడిపోతున్నాయని ఉద్దేశంతో తాము బురద ఉన్న ప్రాంతంలో మోరము పోసి రోడ్డుకు మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు. అధికారులు చేయని పని ఆటో డ్రైవర్లు చేయడంతో ప్రయాణికులు ఆటో డ్రైవర్లను అభినందించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.