calender_icon.png 17 September, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలి

17-09-2025 06:01:07 PM

ఇల్లంతకుంట,(విజయక్రాంతి): ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని మోడల్ స్కూల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదులు పరిశీలించి, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా తీశారు. అన్ని పాఠ్యాంశాలను నిత్యం చదివించి రాయించాలని, ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని అన్నారు.

అనంతరం కందికట్కూర్ ఇందిరమ్మ కాలనీ పరిశీలించారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో నిలిచి ఉన్న నీరును గమనించిన కలెక్టర్ సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని, కావలసిన అన్ని వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని, స్థానికులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపిడిఓ శశికళ, నాయబ్ తహశీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.