17-09-2025 07:42:18 PM
కోదాడ: ఏఎంటీఐ మ్యాధ్స్ ఒలింపియాడ్ లో కోదాడలోని జయ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ చెన్నైలోని ఏఎంటీఐ వారు నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్ లో తమ స్కూల్ విద్యార్థులు 21 మంది రెండో లెవల్ కు అర్హత సాధించారన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు.