17-09-2025 07:53:36 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): నగరంలోని స్థానిక మారుతినగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్న దివ్యాంగుల పాఠశాలను విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి(Chakrapani) బుధవారం సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, 33 సంవత్సరాల క్రితం నేను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేశానని, ఆ సమయంలో విద్య వ్యవస్థలో, వైద్య రంగంలో, నీటిపారుదల రంగంలో, హార్టికల్చర్ రంగంలో చాలా మార్పులు చేశానని అవి నాకు ఇంకా తీపి జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయన్నారు. విధాత నిర్దేశమొ విధి రాతయో కొంతమంది వైకల్యాన్ని సంతరించుకున్నారని కానీ నేడు శాస్త్రీయ పరంగా, విజ్ఞాన పరంగా సరైన సమయంలో జినోమ్ పరీక్షల ద్వారా, అవయవాల నిర్మాణం, మేదస్సు యొక్క స్థితి తెలుసుకోగలమని గర్భాస్త్రంలో ఉన్న శిశు ఏదైనా లోపాలతో ఉన్నట్లయితే లోపాలను సరిచేసి ఆరోగ్యకరమైన సాధారణ శిశువును జన్మించడానికి నేడు శాస్త్ర సాంకేతిక రంగాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని సమాజాన్ని కోరారు.
జినోమ్ ఏర్పాటు చేసిన పిసి గాంధీ తనకు మంచి మిత్రుడని ఈ రంగంలో ఆయన సహాయ సహకారాలు మనం తీసుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించడానికి అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో కూడా మాట్లాడి వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టిఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక రైతుకు ఒక సైనికుడికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టిఎమ్ఆర్ ఫౌండేషన్ అశోక్ కుమార్ సామ్రాట్, స్నేహ సొసైటీ, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, బి సి టి యు రమణ స్వామి మానసిక వికలాంగులు, అందులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం మానసిక వికలాంగులు చేస్తున్న ఒకేషనల్ ప్రొడక్ట్స్ ఒకేషనల్ ఉత్పత్తులు అయిన ఫినాయిల్ పూసలతో బ్యాగులు వస్తువులను పరిశీలించారు అనంతరం మానసిక వికలాంగులను అభినందించారు. అదేవిధంగా కార్యక్రమంలో రైతు సుధీర్ మహాజన్, సైనికుడు సురేష్ పోలిశెట్టి లను సన్మానించారు జిల్లా సైనిక వెల్ఫేర్ అధ్యక్షుడు సుర హర ప్రసాద్ పాల్గొన్నారు.