17-09-2025 06:05:07 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 7 సర్వేలు చేయిస్తే.. 7 సర్వేల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిందన్నారు. అలాగే కాంగ్రెస్ చేయించిన 3 సర్వేల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చిందన్నారు. ముడుపుల కోసం ఎల్ అండ్ టీ ని వేధిస్తున్నారేమో.. ఎల్ అండ్ టీ సీ.ఎఫ్.వోని జైల్లో వేస్తామని సీఎం అన్నారు.. వేధింపులతో వెళ్లిపోతామని ఎల్ అండ్ టీ వాళ్లు అంటున్నారన్నారు. కేసులు ముందు పెట్టి సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారని.. ఎమ్మార్ ప్రాపర్టీస్ లో 25 శాతం వాటా అమ్ముకోవాలని చూస్తున్నారని.. ఎమ్మార్ ప్రాపర్టీస్ వాళ్లకు మూసీ ప్రాజెక్టు కూడా ఇస్తారట అని కేటీఆర్ పేర్కొన్నారు.
అటు ఫార్ములా-ఈ విషయంలో గ్రీన్ కోతో ఒప్పందం చేసుకున్నారని.. ఒప్పందం వల్లే ఛార్జ్ షీట్ నుంచి గ్రీన్ కోను తప్పించారని తెలిపారు. ట్రిపుల్ ఆర్ విషయంలో భారీ కుంభకోణం జరుగుతుందని, సీఎం బంధువుల కోసం దక్షిణ భాగం అలైన్ మెంట్ మారుస్తున్నారని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ స్కామ్ పై త్వరలో అన్ని వివరాలు బయటపెడతానని.. ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పుతో రూ.7000 కోట్లు భారమని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ఊహజనితం.. అక్కడ పురుగు కూడా లేదని.. పురుగు కూడా లేని ఫ్యూచర్ సిటీకి భారీ రోడ్డు వేస్తున్నారని అన్నారు. పురుగు కూడా లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో కూడా తీసుకెళ్తారట అని తెలిపారు.