7 May, 2026 | 5:53 AM

29న రాష్ట్రానికి నడ్డా

26-04-2024 01:53 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 29న తెలంగాణకు రానున్నారు. ఒకేరోజు ఖమ్మం, మహ బూబాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం చేరుకొని.. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 వరకు జరిగే సభలో పాల్గొంటారు.  అనంతరం 3 గంటల నుంచి సాయం త్రం 4 వరకు మహబూబాబాద్‌లో జరిగే సభలో పాల్గొంటారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని సాయంత్రం 6 గంటల నుంచి మల్కాజిగిరి, ఉప్పల్‌లో జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు.