01-01-2026 12:27:15 AM
ములకలపల్లి, డిసెంబర్ 31,(విజయక్రాంతి): రైతులు యూరియా కొరకు ఆందోళ న పడవలసిన అవసరం లేదని మండలంలో యూరియా అందుబాటులో ఉందని మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. మండలంలో 1152 యూరియా బస్తాలు (సొసైటీలో - 473 బస్తాలు, మన గ్రోమోర్ లో - 535 బస్తాలు, శ్రీ సాయి శ్రీనివాస ట్రేడర్స్ లో - 144 బస్తా లు) అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూరియా కొరత ఉంది అనే అపోహలు రైతులు నమ్మవద్దని తెలిపారు.యాసంగి పంటలకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు రైతులకు ఎప్పటికప్పుడు అందుబా టులో ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో కాకుండా మునుపటి మాదిరిగానే రైతులు యూరియా కొనుగోలు చేయవచ్చని వివరించారు.