పిల్లల్లో కొలాస్టమీని దూరం చేయండి
- కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో కొలాస్టమీ సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు
- ప్రపంచ పీడియాట్రిక్ డే సందర్భంగా వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పిల్లల్లో పుట్టుకతో వచ్చే కొన్నిరకాల సమస్యలతో పాటు పేగుల్లో క్యాన్సర్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు తాత్కాలికంగా చేసే ఏర్పాటును కొలాస్టమీ అంటారు. ఇం దులో భాగంగా మలవిసర్జన మార్గాన్ని తా త్కాలికంగా ఆపేసి.. పెద్ద పేగుల చివరిభాగాన్ని పొట్ట భాగం వైపు నుంచి బయటకు తీస్తారు. అక్కడ ఒక డిస్పోజబుల్ బ్యాగ్ ఏర్పాటు చేయడం ద్వారా.. మలం అందులోకి వెళ్లేలా చూస్తారు.
ఆ బ్యాగులను ఎప్ప టికప్పుడు శుభ్రం చేసుకోవడం, మార్చుకోవడం ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత పాటించవ చ్చు. దీన్నే కొలాస్టమీ అంటారు. అయితే, ఈ తరహా ఏర్పాటు ఉన్న పిల్లలుండే కుటుంబాల్లో విపరీతమైన భయం, అనుమానాలు, సామాజిక సమస్యలు ఉంటాయి. వీటన్నింటినీ దూరం చేసేందుకు జాతీయ పీడి యాట్రిక్ సర్జరీ డే సందర్భంగా సోమవారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్ సర్జరీ నిపుణుల ఆధ్వర్యంలో కొలా స్టమీ సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేశారు.
దీనికి చీఫ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎం. యోగనాగేందర్ నేతృత్వం వహించా రు. ఈ గ్రూప్ ద్వారా కొలాస్టమీపై అవగాహన కల్పించి, వారికి తగిన విజ్ఞానం అందించడంతో పాటు కొలాస్టమీ ఏర్పాటు చేయించుకున్న పిల్లల తల్లి దండ్రులకు అవసరమైన అన్నిరకాల మద్ద తు కల్పిస్తామని తెలిపారు. భారతదేశంలో ఇదే మొట్టమొదటి గ్రూప్ అని చెప్పారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 29న జాతీయ పీడియాట్రిక్ సర్జరీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. పిల్లల జీవితాలను మె రుగుపరచ డంలో పీడియాట్రిక్ సర్జన్లు పోషించే పాత్ర ను గౌరవించడమే దీని లక్ష్యం. డాక్టర్ బాబు ఎస్ మదార్కర్, కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియోనాటాలజిస్ట్ పాల్గొన్నారు.




