13 March, 2026 | 8:39 PM

చుక్కల్లో వెండి ధరలు

30-12-2025 12:00 AM

రూ.౩ లక్షలకు చేరువలో ధర

న్యూఢిల్లీ, డిసెంబర్ ౨౯: అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో వెండి ధర దాదాపు రూ.౩ లక్షల మా ర్కుకు చేరువైంది. పారిశ్రామికంగా వెండికి అమాంతం డిమాండ్ పెరగడంతోనే ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్గాలు, ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. వెండి ఉత్ప త్తి కంటే వినియోగం అధికంగా ఉండటంతో సరఫరా కొరత ఏర్పడిందంటున్నారు.

సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు. బ్యాటరీల తయారీ, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ రంగాల్లోనూ దీని వినియో గం పెరిగిందని తెలుపుతున్నారు. ఏదయితేనేం.. మదుపర్లను మాత్రం వెండి ధరలు మురిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితులు ఉన్నందున వారు వెండిపై పెట్టుబ డులు మళ్లిస్తున్నారు.