28-12-2025 12:18:24 AM
తాజా ధర రూ.2.36 లక్షలు
హైదరాబాద్, డిసెంబర్ 27: వెండి ధర ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో రూ.90,500 వద్ద ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తు లో పెరిగింది. ధరల పెరుగుదల క్రమంలో జూలై 26న 1,18,120, ఆ తర్వాత ఆగస్టు 26న రూ.1,23,126 వద్దకు చేరింది. అలాగే సెప్టెంబర్ 26న 1,43,258, అక్టోబర్ 26కి 1,45,046, నవంబర్ 26కు 1,64,945, డిసెంబర్ 26నాటికి 2,36,350 వద్ద నిలిచిం ది. శుక్రవారం నాడు వెండి ధర రూ.20, 000 పెరగడంతో కిలో రూ.2.74 లక్షలకు చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం కిలో వెం డి రూ.11 వేలు పెరిగి రూ.2.51లక్షలు ఉంది.
ఒక్కరోజే రికార్డు స్థాయిలో..
చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే ఏకంగా రూ. 20 వేలు పెరిగింది. దేశీయం గా హైదరాబాద్ నగరంలో ఇవాళ రూ. 20 వేలు పెరిగిన వెండి ధర కిలోకు రూ. 2.74 లక్షల వద్ద ఉంది. ఇది జీవన కాల గరిష్ఠ స్థాయి ధరగా చెప్పొచ్చు. దీనికి ముందు కూ డా వరుసగా రూ. 9 వేలు, రూ. 1000, రూ. 10 వేలు, రూ. 3 వేలు, రూ. 5 వేలు పెరిగింది. ఇలా 6 రోజుల్లోనే రూ. 48 వేలు పెర గ్గా.. 8 రోజుల్లో రూ. 53 వేలు పెరగడం గమనార్హం.
దీంతో ఇప్పుడు వెండి కొనడం కూడా చాలా కష్టంగా మారింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సిల్వర్ రేటు రికార్డు స్థా యిలో 170 శాతానికిపైగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. బంగారం కంటే రెట్టిం పు స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా వెండి ధర ఒక్క రోజులోనే 10 శాతానికిపైగా పెరిగింది. స్పాట్ సిల్వర్ రేటు 10 శాతం పెరగడంతో ఇప్పుడు అది ఔన్సుకు 79.38 డాలర్ల వద్ద స్థిరపడింది.
పారిశ్రామికంగా వెండికి బాగా డిమాండ్ ఉండటం.. అదే సమయంలో గిరాకీకి తగినట్లుగా సప్లై లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు దారితీస్తోంది. సోలార్ ప్యానెల్స్ తయారీలో, ఎలక్ట్రిక్ వాహనాలు, 5జీ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల తయారీలో, ఏఐ డేటా సెంటర్లలో, సెమీ కండక్టర్లు వంటి రం గాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ధరలూ పెరుగుతున్నాయి.