calender_icon.png 5 February, 2026 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాన్సర్‌పై అవగాహన అవసరం

05-02-2026 01:52:20 AM

కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాదర్‌ఘాట్ ఎస్‌హెవో బ్రహ్మ మురహరి, డీఐ శ్రీనివాస్ హాజరయ్యారు. డా. ఎం. ఏ. సుబూర్ షహీరోస్, సీనియర్ కన్సల్టెంట్ - హీమటాలజీ మెడికల్ ఆంకాలజీ; డా. షేక్ సలీమ్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్; డా. రాజేంద్ర ప్రసాద్ భూపతి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్; ప్రవీణ్ కుమార్ ఎడ్లా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కేర్ హాస్పిటల్స్, మాలక్‌దీతిజిజిపేట్; డా. శ్రీధర్, మెడికల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్యాన్సర్‌ను తొందరగా గుర్తించడం, సమయానికి చికిత్స తీసుకోవడం, చికిత్స అనంతరం నిరంతర పర్యవేక్షణ ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమంలో వివరించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, కేర్ హాస్పిటల్స్, మాలక్‌పేట్ ప్రజలకు ఫిబ్రవరి 14 వరకు ఉచిత క్యాన్సర్ డాక్టర్ కన్సల్టేషన్ అందిస్తున్నట్లు ప్రకటించారు.