05-02-2026 01:53:17 AM
మెగాస్టార్ చిరంజీవి
కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ‘క్యాన్సర్ శాపం కాదు. మన జీవన విధానంలో మనతోనే మొదలువుతుంది’ అని పద్మవిభూషన్, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ అనేగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా.. కానీ ఇక్కడ ఇంత మంది క్యాన్సర్ వ్యా ధిని జయించిన వారి చూస్తుంటే డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారో అర్థమవుతుంది.
క్యాన్సర్ మరణశాసనం కాదు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్‌ని కూడా జయించి సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చు’ అన్నారు. నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ.. జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. ప్రజల్లో అవగాన కోసం కిమ్స్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్‌ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట, క్యాన్సర్ చికిత్స పొందిన, పొందుతున్న వారు పాల్గొన్నారు.