21-11-2025 10:34:20 PM
మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య
కాటారం,(విజయక్రాంతి): తేనే టీగల పెంపకంతో రైతులకు లాభదాయకమైన ఆదాయం సమకూరుతుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో వారం రోజుల పాటు నిర్వహించనున్న తేనే టీగల పెంపకం శిక్షణ శిబిరాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ తో కలిసి తిరుమల సమ్మయ్య ప్రారంభించారు.
కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటి ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ పద్ధతిలో తేనే టీగల పెంపకం చేపట్టేందుకు ఏడు రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్ పర్సన్ తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతో పాటు తేనే టీగల పెంపకం ద్వారా లాభాదాయ అదనపు వనరుగా ఉంటుందని అన్నారు. పెంపకానికి అయ్యే ఖర్చు ఎన్ బి బి ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే వారం రోజుల పాటు జరిగే శిక్షణ లో పాల్గొనే రైతులకు భోజన వసతి కూడా ఉంటుందని తెలిపారు.