ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
24-07-2026 12:11 AM
టేకులపల్లి, జులై 23, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం చింతోనిచలక గ్రామంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం, ఎల్నినో ప్రభావంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తాము సాగు చేస్తున్న పంటల్లో కనీసం అర ఎకరం లేదా ఒక మడి విస్తీర్ణంలో అయినా రసాయన ఎరువులు, పురు గుమందులు ఉపయోగించకుండా పశువుల పేడ,
సేంద్రియ ఎరువులు, వేప, సీతాఫలం, వావిలాకు, వెంపలి ఆకులతో తయారు చేసిన కషాయాలను పిచికారీ చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించాలని సూచించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున వర్షాధారిత పంటలను సాగు చేయడం మంచిదని రైతులకు వివరించారు. పఈ కార్యక్రమంలో ఏడీఏ లాల్చంద్, ఆత్మా చైర్మన్ మంగీలాల్, ఏఈఓ అన్నపూర్ణ, ఏఈఓ రెహానాతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.






