24 July, 2026 | 3:24 AM

రామాలయ విస్తరణ పనులను నాణ్యతతో నిర్మించండి

24-07-2026 12:12 AM

దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు

భద్రాచలం, జులై 23, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను నాణ్యతతో నేర్పించాలని దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు కోరారు. గురువారం నాడు దేవదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు క్షేత్రస్థాయిలో దేవాలయం అభివృద్ధి పనులు పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణాల పురోగతిని పరిశీలించిన ఆయన, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగడంతో పాటు, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని, ఆలయ వైభవానికి అనుగుణంగా విస్తరణ పనులను పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.ఈ సందర్భంగా ఈవో దామోదరరావు, ఈఈ రవీందర్,  దేవస్థానం అర్చకులు, అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం వద్ద పురోహితులు అధికారులు సాంప్రదాయపద్ధంగా స్వాగతం పలికి స్వామివారి పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదం అందజేశారు.