పోక్సో, అత్యాచార చట్టాలపై అవగాహన
సంగారెడ్డి, ఏప్రిల్ 8 : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ఎం.ఎన్.ఆర్ ఉన్నత పాఠశాలలో భరోసా కో-ఆర్డినేటర్, సిబ్బంది పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, నేరాలకు విధించే శిక్షల గురించి విద్యార్థులకు వివరించారు. పోక్సో అత్యాచార కేసులలో భరోసా కేంద్రం పాత్ర, అందించే సేవలు గురించి అవగాహన కల్పించారు.
విద్యార్ధులు చిన్నప్పటి నుండి పెద్ద గోల్స్ పెట్టుకొని, లక్ష్యాలను సాధించేలా రోజువారీ ప్లాన్ ఉండాలని సూచించారు. యవ్వన దశలో కలిగే ఆకర్షణలు, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాలు, విద్య యొక్క అవసరం వంటి అంశాలపై కూడా విద్యార్థులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మారియా నాతన్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




