calender_icon.png 3 December, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్యవివాహ నిరోధక చట్టంపై అవగాహన

03-12-2025 12:56:43 AM

బూర్గంపాడు,డిసెంబర్ 02,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర పి.హెచ్.సి లో మంగళవారం ఆశా డే లో బాల్య వివాహ నిరోధక చట్టం 2006 పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా  డి.ఎచ్.ఈ.డబ్ల్యు సంతోష్ రూపా మాట్లాడుతూ....బాల్యవివాహ నిరోధక చట్టం యొక్క అంశాలు బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే నష్టాలు,విధించబడే శిక్షలు అమల్లో ఉన్న చట్టాల గురించి వివరించారు.

బేటి బచావో బేటి పడావో యొక్క ప్రాముఖ్యతను, పోక్సో చట్టం గురించి,హెల్ప్ లైన్ నెంబర్ల గురించి అవగాహన కల్పించారు.మహిళలపై హింస నిర్మూలన 16 డేస్ యాక్టివిటీ లో భాగంగా డివీ యాక్ట్, సఖి సర్వీసెస్ గురించి, సుకన్య స్కీమ్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, భరోసా సర్వీసెస్  గురించి తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో డా. సాహితీ, హెల్త్ సూపర్వైజర్ లు, డిహెచ్‌ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ సంతోష రూప, భరోసా కోఆర్డినేటర్ రేణుక, రమాదేవి, సంధ్య, ఏ ఎన్ ఎమ్, ఆశాలు పాల్గొన్నారు.