02-07-2025 05:43:14 PM
నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండలం(Soan Mandal) పాక్ పట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై సోన్ పిహెచ్సి సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాయిశిల్ప(Community Health Officer Sai Shilpa) మాట్లాడుతూ... వర్షాకాలంలో సంక్రమించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే చాలా వ్యాధులు దూరమవుతాయని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎన్.వెంకన్న ఉపాధ్యాయులు ఎం. చంద్రశేఖర్ రావు, తోడిశెట్టి రవికాంత్, గటిక రవికాంత్, జె.శ్రీధర్, డి.అరుణ, బలిరాం రాథోడ్, ఆశా సిబ్బంది రాజేశ్వరి, వనిత, లాహరిక తదితరులు పాల్గొన్నారు.