03-07-2025 09:50:50 AM
సనత్ నగర్,(విజయక్రాంతి): ఎస్ఆర్ నగర్ నారాయణ ఉన్నత పాఠశాల(Narayana School) యందు విద్యార్థులు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్య క్రమం లో ఎజియం శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపల్ రామలక్ష్మీ, డాక్టర్లు సురేష్ బాబు, తుషార లు పాల్గొన్నారు.స్ధానిక ఆదివిక హాస్పిటల్ వైద్యులు పాఠశాలలో వైద్య సదస్సు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు,సూచనలు అందజేశారు.పిల్లలను పరిక్షీంచి తగిన సూచనల ను చేశారు.ఈ సందర్భంగా వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్య క్రమం లో ఆర్ఐ మాధవ రెడ్డి,ఎ డి శేషగిరి,కో ఆర్డినేటర్స్ శ్రీకాంత్,ఫరజాన, రషిమిక,వైస్ ప్రిన్సిపల్స్ అనిత,మాలిని,ఎ ఒ నితిన్ తదితరులు పాల్గొన్నారు.