calender_icon.png 3 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెడ్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

02-07-2025 05:39:46 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Girls School)లో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి ఎం దత్తుమూర్తి(Mandal Education Officer M. Dattumurthy) తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి 18 నుండి 45 సంవత్సరం లోపు మహిళలు మాత్రమే అర్హులని, అభ్యర్థులు స్థానికులుగా నిర్ధారిస్తూ తహసిల్దార్ జారీ చేసిన నివాస పత్రం కలిగి ఉండాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాన్ని అన్ని దృవపత్రాలు, ఆధార్ కార్డును జతపరిచి ఈనెల 2 నుండి 7వ తేదీ వరకు మండల విద్యా వనరుల కేంద్రంలో అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన స్థానిక మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.