25-11-2025 11:16:59 AM
గ్రామ పంచాయితీ ఎన్నికలపై చర్చ..
విద్యుత్ రంగంపై ప్రత్యేకంగా చర్చించనున్న మంత్రివర్గం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన మంగళవారం నాడు కేబినెట్ సమావేశం(Telangana Cabinet meeting) కానుంది. విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలు ప్రధాన అజెండగా ఈ భేటీ కొనసాగనుంది. రామగుండంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ, డిసెంబర్ 8,9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ పై చర్చించే అవకాశముంది. విస్తృతంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.
తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సీఎం ఫోకస్
తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నేటి నుంచి శాఖల వారిగా సమీక్ష నిర్వహించనున్నారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్వవస్థ లక్ష్యంగా అడుగులేస్తున్నారు. ప్రజాభిప్రాయాల ఆధారంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నారు. విద్య, వైద్యం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యువతకు ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీపై శిక్షణ కల్పించనున్నారు.