calender_icon.png 23 July, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడు ఆరోగ్యంపై అవగాహన

23-07-2025 01:11:01 AM

- లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నిర్వహణ

- హాజరైన ఆస్పత్రి యజమాని డాక్టర్ విజయ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా అంగవైక ల్యం కలిగించేవి, అత్యధిక మరణాలుకు కారణమయ్యేవి మెదడుకు సంబంధించిన వ్యాధులేనని లలితా సూపర్ స్పెషాలిటీ అధినేత్రి డాక్టర్ విజయ తెలిపారు. మంగళ వారం వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ వారి ఆధ్వర్యంలో స్థానిక లలిత హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన మెదడు, నరాల జబ్బు ల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడా రు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా జనాభా నాడీ సంబంధిత వ్యాధులతోనే బాధపడుతున్నారని తెలిపారు.

వీటన్ని నివారించేందుకు గర్భధారణకు ముందు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం, పిల్లలకు టీకాలు వేయించడం, యువతకు   రోడ్డుప్రమాదాల నివారణ, చెడువ్యసనాల పట్ల అప్రమత్తత, మధ్య వయస్సు, పెద్ద వయస్సు  వారిలో హెల్త్  చెకప్లు, రిస్క్ ఫ్యాక్టర్ల కంట్రోల్  పండ్లు చేయించుకోవాలని తెలిపారు. ఆరోగ్యకరమైన మెదడు కోసం  సమతుల్య ఆహారం, శారీరక శ్రమ  ఒత్తిడిని  జయంచటం, నాణ్యమైన నిద్ర, సామజిక కార్యకలాపాలలో చురుకుగా ఉండాలని తెలిపారు. మెదడును చురుకుగా ఉంచుకుంటూ, చిన్నపాటి వ్యా యామాలు నడక ఆరోగ్యకరమైన ఆహరం తీసుకుంటే రాకుండా నివారించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరో న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వీరమ్మ మాట్లాడుతూ.. తలనొప్పి అత్యంత సాధారణ నాడీ సంబంధిత వ్యాధిగా అన్ని వయస్సులవారికి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు, సీనియర్ న్యూరో సర్జన్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజ్యురీ, డాక్టర్ ఉషా కిరణ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డాక్టర్ రెష్మా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, డా. ఆజ్మా, న్యూరాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ అజయ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, న్యూరోసర్జన్ డాక్టర్ స్రుజన, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.