calender_icon.png 23 July, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

23-07-2025 01:09:56 AM

ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి

యాచారం జులై 22 :రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అ న్నారు. మంగళవారం మండల పరిధిలోని గునగల్, తులే కలన్ ( పెతుల్ల), చౌదర్పల్లి,యాచారం, మొండి గౌరెల్లి, గ్రామాలలో 90 లక్షల నిధులతో అభివృద్ది పనులు. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.

ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, రైతు బీమా, క్రాఫ్ లోన్లు అమలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు వివరించారు.

విడతలవారీగా రైతులందరికీ రైతు భరోసాను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆయ్యప్ప, ఎంపీడీవో బాల శంకర్, ఎంపీఓ శ్రీలత, అధికారులు, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మెన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మస్కు నరసింహ, అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్, తదితరులుపాల్గొన్నారు.