calender_icon.png 23 July, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కొనసాగుతున్న వరద

23-07-2025 07:54:07 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. బుధవారం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 94,709 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 4,835 క్యూసెకులు ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 572 అడుగులు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 261 టీఎంసీల నీటి నిల్వ ఉంది.