calender_icon.png 23 July, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి

23-07-2025 01:11:26 AM

తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి హామీ

ఎల్బీనగర్, జులై 22 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, స్వర్ణకారుల సంక్షేమానికి త్వరలో స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చా రు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి ఆధ్వర్యం లో మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిని వేర్వేరుగా కలిసి స్వర్ణకారుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్వర్ణ కారుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు స్వర్ణకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని స్వర్ణకారుల సంఘం ప్రతినిధులకు మంత్రులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి మాట్లాడుతూ... సాధ్యమైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికల లోపే స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏ ర్పాటు చేయాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వర్ణకారులందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పూర్తి మద్దతు ప్రకటించి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు. మంత్రులను కలిసినవారిలో స్వర్ణకారుల సంఘం రాష్ట్ర సలహాదారులు దుబ్బాక కిషన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు, పోతకమూరి రమేష్, పోతులూరి చారి, రాగి ఫణి సతీష్, ఏ కే ఆర్ రాజనర్సింహ చారి, అంజయ్యచారి తదితరులుపాల్గొన్నారు.