శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన
భిక్కనూర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): 7వ జాతీయ సామాజిక సేవా వారోత్సవం 2026లో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డిలోని జల్ జీవన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీలో శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవా విభాగం హెడ్ డా. అంజయ్య బండేలా మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని తెలిపారు.
సమతుల్య ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ, కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఆరోగ్యానికి అవసరమన్నారు. అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. HIV, లైంగిక వ్యాధులపై అవగాహన కల్పించిన శ్రీనివాస్ గౌడ్ అపోహలు వీడి పరీక్షలు, చికిత్స పొందాలని తెలిపారు. కార్యక్రమంలో రవికుమార్, కృష్ణ, సలావుద్దీన్, వెంకట్లక్ష్మి, అఖిల, నిరోష, లత, నవ్య, మనీష, వినిత్, నాగరాజు పాల్గొన్నారు.






