9 May, 2026 | 5:43 AM

తలసేమియా వ్యాధిపై అవగాహన

09-05-2026 01:31 AM

మఠంపల్లి మే 8: మండల కేంద్రంలోని పిహెచ్ సి లో ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణి ఆధ్వర్యంలో శుక్రవారం తలసేమియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.కళ్యాణి మాట్లాడుతూ తలసేమియా వారసత్వంగా, జన్యు సంక్రమిత ద్వారా వచ్చే రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో శరీరంలో హీమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉండటంతో రక్తహీనత వలన శరీరం క్షీణిస్తుందని చెప్పారు.