01-11-2025 07:08:47 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్‌కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్ (బుద్వెల్) అంకుషాపూర్ లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్ రూరల్ యూనిట్ సహకారంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, సిబ్బంది అక్రమాలను అరికట్టడం, నిజాయితీతో వ్యవహరించడం కోసం ప్రమాణం చేశారు. పోస్టర్ ప్రదర్శన వాక్‌థాన్ కూడా నిర్వహించబడింది.
దీని ద్వారా విద్యార్థుల్లో పారదర్శకత నైతిక విలువల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించినందుకు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ పి. శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలోని అధికారులకు కళాశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ శారద ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, విద్యార్థులు తమ వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో నిజాయితీ, బాధ్యతా విలువలను అనుసరించాలని ప్రోత్సహించారు. ఘట్ కేసర్ ఎస్ఐ హీన, విజిలెన్స్ అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.