01-11-2025 07:08:45 PM
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దంపతులు
కొల్చారం: కొల్చారం మండలం రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి కరకమలములచే ప్రతిష్ఠ గావించిన శ్రీ సప్త సంతాన నాగేశ్వర స్వామి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా ఆశ్లేష నక్షత్రం రోజు విశిష్ట పూజలు నిర్వహించాలని, 27 సార్లు శ్రీ సప్తసంతాన నాగేశ్వర స్వామి జపం చేసి 9 సార్లు ప్రదక్షిణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ నేత తోపాజి అనంత కిషన్ దంపతులు పీఠాధిపతి శ్రీ మాధవానంద స్వామి ఆదేశాల మేరకు ప్రతిరోజూ పూజలు చేస్తూ శ్రీ మడేల్ మహరాజ్ పూజలు కూడా చేశారు.