04-09-2025 05:30:53 PM
మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్లు..
మంచిర్యాల (విజయక్రాంతి): పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలనీ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్(ACP Prakash), జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు(ACP Venkateshwarlu) పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డులో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు ఆధ్యాత్మికంగా, శాంతి యుత మార్గంలో నిర్వహించుకోవాలన్నారు. ఐక్యతతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలను, నిమజ్జనోత్సవాన్ని నిర్వహించుకోవాలని సూచించారు.
సామాజిక సేవలో తమవంతుగా...
ఈ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ, సామాజిక సేవలో తమవంతు బాధ్యతగా ఆంజనీ పుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుదన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం డైరెక్టర్ లు, స్థానిక సీఐ, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.