22 August, 2026 | 2:35 AM

పార్థీనియం నిర్మూలనపై అవగాహన

22-08-2026 12:00 AM

రాజేంద్రనగర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): పార్తీనియం నిర్మూలనలో భాగంగా 21వ పార్తీనియం అవేర్నెస్ వీక్ 6 వ  రోజు కార్యక్రమాన్ని ఐకార్-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్  హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. బండ్లగూడ జాగీర్లోని పద్మశ్రీ హిల్స్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐకార్-నార్మ్ డైరెక్టర్ డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం మార్గదర్శకత్వంలో పద్మశ్రీ హిల్స్ కాలనీలో విస్తరించిన పార్తీనియం హిస్టెరోఫోరస్ (వయ్యారిభామ) మొక్కలను తొలగించారు.

ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన సాంకేతిక, ఔట్సోర్సింగ్ సిబ్బందితో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. సుమారు 50 మంది ఈ పార్తీనియం నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఐకార్-నార్మ్ సీఎస్‌ఓ డాక్టర్ లక్ష్మణ్ ఎం. అహిరే, ఎక్స్‌ఎస్‌ఎం విభాగాధిపతి డాక్టర్ ఆర్. వెంకటకుమార్ సమన్వయంతో నిర్వహించారు.