22 August, 2026 | 1:46 AM

సస్యరక్షణతోనే అధిక దిగుబడులు

22-08-2026 12:00 AM

ఏఓ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, అగస్టు 21(విజయక్రాంతి): ఆత్మా పథకంలో భాగంగా రామ్నుంతల, పోలేపల్లి, శెట్టిపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల్లో వరి, జొన్న పంటల్లో సస్యరక్షణ, పో షక యాజమాన్య పద్ధతులపై క్షేత్ర ప్రదర్శనలను శుక్రవారం నిర్వహించారు.ఈ సంద ర్భంగా రైతులకు జీవ నియంత్రణ కారకాలై న ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్తో పాటు సూక్ష్మ పోషకాలు, మందు గుళికలను పం పిణీ చేశారు. సమగ్ర సస్యరక్షణ, సరైన పోషకాల యాజమాన్యంతో సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు మీనాక్షి, ప్రభావతి, స్థానిక రైతులు పాల్గొన్నారు.