23 June, 2026 | 12:47 AM

గురుకుల విద్యార్థులకు 1098 సేవలపై అవగాహన

23-06-2026 12:08 AM

ఎర్రవల్లి జూన్ 22: మండల పరిథి లోని ఐజగురుకుల పాఠశాల విద్యార్థులకు సోమవారం  డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, చైల్ హెల్ప్లైన్ 1098 సేవలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సీఐ ప్రదీప్, ఎస్‌ఐ రవి రాథోడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.