28 August, 2026 | 6:15 AM

అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి

23-06-2026 12:06 AM

అనారోగ్యంతో మృతి చెందిన అరుణ్ రెడ్డి 

స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా గంగారం 

బిజినేపల్లి, జూన్ 22: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సాయి అరుణ్‌రెడ్డి(26) అనే యువకుడు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, అక్కడే అనారోగ్యంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు.

నాగర్‌కర్నూల్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన సాయి అరుణ్‌రెడ్డి అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

విదేశాల్లో తెలుగు విద్యార్థులు, తెలంగాణ తాజా వార్తలు, జాతీయ, వ్యాపార, విద్య, క్రీడలు మరియు జిల్లా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్‌ను ఫాలో అవ్వండి.

సాయి అరుణ్‌రెడ్డి తల్లి సరళమ్మ గ్రామంలోనే అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తుండగా, తండ్రి వెంకట్‌రెడ్డి వ్యవసాయం చేస్తున్నాడు. అరుణ్ బి.టెక్ పూర్తి చేసుకుని అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లాడు. కొద్ది నెలలుగా అరుణ్ అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. వైద్యం చేయించుకున్నా, బాగోగులు చూసేవారు లేక ఫలితం లేకుండా పోయింది. 

వ్యాధి ముదిరి మూడు రోజుల క్రితం తాను ఉండే ఇంటిలోనే చనిపోయాడు. అరుణ్ మృతదేహం ఇండియాకు తీసుకురావడానికి దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అరుణ్ మృతదేహం స్వగ్రామానికి రావడానికి మరో మూడు రోజుల వరకు సమయం పట్టవచ్చు.

అమెరికాలో మృతి చెందిన తెలంగాణ యువకుడు ఎవరు?

నాగర్‌కర్నూల్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన 26 ఏళ్ల సాయి అరుణ్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు.

మరిన్ని తెలంగాణ తాజా వార్తల కోసం విజయక్రాంతి న్యూస్ Telangana News సెక్షన్‌ను సందర్శించండి.


FAQ's

Q1. అమెరికాలో మృతి చెందిన యువకుడు ఎవరు?

సాయి అరుణ్‌రెడ్డి (26), నాగర్‌కర్నూల్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన యువకుడు.

Q2. ఆయన ఎందుకు అమెరికాకు వెళ్లాడు?

ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు.

Q3. మరణానికి కారణం ఏమిటి?

కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందాడు.

Q4. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది?

సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు.

Q5. మృతదేహం ఎప్పుడు స్వగ్రామానికి చేరే అవకాశం ఉంది?

మరో మూడు రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది.