23 June, 2026 | 1:05 AM

మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం లక్ష్యం

23-06-2026 12:08 AM
  1. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్
  2. అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేయాలి
  3. ఎమ్మెల్యే ముఠా గోపాల్
  4. ముషీరాబాద్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
  5. 40,322 మంది మహిళలకు చీరల పంపిణీ

ముషీరాబాద్, జూన్ 22 (విజయక్రాం తి): కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ వాలీబాల్ గ్రౌండ్స్ గల జీహెచ్‌ఎంసీ హాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్‌ఎంసీ యూసీడీ అధికారి శ్రీలతతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ అని ల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ  మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగా లలో పెద్ద పీఠ వేసిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద మార్పులు జరగవచ్చని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మా ట్లాడుతూ  అర్హులైన ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేయాలని డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే విధంగా అధి కారులు క్రమశిక్షణతో పనిచేయాలని సూ చించారు.

జీహెచ్‌ఎంసీ యూసీడీ అధికారి శ్రీలత మాట్లాడుతూ  ఇందిరా మహిళా శక్తి చీరలు మొదటి విడత మహిళా పొదుపు సంఘాల సభ్యులకు అందజేస్తామని తెలిపారు. రెండవ విడత తెల్లరేషన్ కార్డు ఉన్న మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ముషీరాబాద్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ పరిధిలో 765 మహిళా పొదుపు గ్రూపులకు, కవాడిగూడ సర్కిల్లో 1325 మహిళా పొదుపు గ్రూపులకు అందజేస్తామని తెలిపారు. మొత్తం 40322 మందికి చీరలను అందజేసేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇందిరా మహిళాశక్తి చీరలు దిగుమతి అ య్యాయని వాటన్నింటిని మహిళలకు అందజేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక యాప్ ద్వా రా ఫోటోలు తీసి అర్హులకు చీరలు ఇస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యద ర్శులు శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు టి. సోమన్, మెట్టు సురేష్, తలారి శ్రీకాం త్ ముదిరాజ్, శివముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, పి. శ్రీధర్ చారి, టెంట్ హౌస్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ కల్పనయాదవ్, ముషీరాబాద్, బాపూ జీనగర్, బాకారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్‌గౌడ్, నరేందర్ బాబు, వెంకట్, పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వెంకటే ష్, నగర కార్యదర్శి దేవివరప్రసాద్, నాయకులు రామకృష్ణ, నాగభూషణం గౌడ్, శ్రీని వాస్ యాదవ్, లింగంగుప్తా పాల్గొన్నారు.