18-12-2025 01:50:45 AM
ఎల్లారెడ్డి, డిసెంబర్ 17 (విజయక్రాంతి): పోక్సో చట్టం, బాలల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, బాల్యవివాహాలు మొదలగు చట్టాల గురించి అవగాహన కల్పించిన,తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు,బుధవారం కామారెడ్డిలోని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో, కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి ఎల్ ఎస్ ఏ) కార్యదర్శి టి నాగరాణి ముఖ్య అతిథిగా,పాల్గొని, కస్తూర్బా గాంధీ,
బాలికల పాఠశాలలోని విద్యార్థులకు పోక్స్ చట్టం, బాలల హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, బాల్యవివాహాలు మొదలగు చట్టాల గురించి అవగాహన కల్పించారు.అనంతరం,కస్తూరిబాగాంధీ,బాలికల పాఠశాలలోని విద్యార్థుల, వసతి గృహంలో ఎల్లారెడ్డి నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పాఠశాలలో ఉన్న పిల్లల యొక్క వంటగదిని, స్నానపు గదులు, నిద్రించే చోట్లు తనిఖీ చేసి అందుకు ఆమె అసంతృప్తి చెందారు. పిల్లల యొక్క ఇతర అవసరాలను తెలుసుకొని తద్వారా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల అధికార న్యాయ సంస్థ అధికారిని ఎం సుష్మ, కస్తూరిబాగాంధీ పాఠశాల ప్రిన్సిపాల్,సిబ్బంది ఇతరులు తదితరులు పాల్గొన్నారు.