18-12-2025 02:09:59 AM
తొలిసారి ఓటేసిన 80 ఏళ్ల వృద్ధుడు
ఆదిలాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని ఆ పంచా యతీకి ఏడు దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరగడంతో 80 ఏళ్ల వృద్ధుడు తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రా మ పంచాయతీకి 69 ఏళ్లుగా గ్రామస్థులు ఏకగ్రీవంగానే సర్పంచ్‌ను ఎన్నుకుంటూ వస్తున్నారు. అయితే తొలిసారిగా మూడో విడతలో ఆ పంచాయతీకి ఎన్నికలు జరగడంతో పంచాయతీ పరిధిలోని చాలామంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 80 ఏళ్ల వృద్ధుడు బోలపతి భూమన్న బుధవారం పంచాయతీ ఎన్నికల్లో తన తొలి ఓటు వేశా డు. అనంతరం సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో లు దిగి మురిసిపోయాడు. కలెక్టర్ రాజర్షి షా సైతం అభినందనలు తెలిపారు.