calender_icon.png 18 December, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఎల్లారెడ్డి బంద్!

18-12-2025 02:22:48 AM

  1. సోమార్‌పేట ఘటనకు నిరసనగా అఖిలపక్షం పిలుపు
  2. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఎల్లారెడ్డి, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సోమార్‌పేట ఘటనలో నిందితులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని, లేదంటే శుక్రవారం ఎల్లారెడ్డి బందుకు పిలుపునిస్తున్నట్లు అఖిల పక్షం నాయకులు తెలిపారు. బుధవారం ఎల్లారెడ్డి శివాజీ చౌరస్తాలో అఖిలపక్షం నాయకులు, సోమార్‌పేట గ్రామస్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సోమా ర్‌పేట సర్పం చుగా గెలిచిన కుర్మ పాపయ్య తమ్ముడు కురుమ చిరంజీవి.. తమ ప్రత్యర్థి బిట్ల బాలరాజుతో పాటు వారి కుటుంబ సభ్యులపై, బాలరాజు మద్దతుదారులను ట్రాక్టర్‌తో ఢీ కొట్టడంతో ఇద్దరి పరిస్థితి విష మంగా ఉందన్నారు.

ముగ్గురు గాయలతో చికిత్స పొందు తున్నట్లు తెలిపారు. చిరం జీవి ఉద్దేశపూర్వకంగానే ట్రాక్టర్ తో ఢీ కొట్టాడని ఆరోపిం చారు. చిరంజీవిని అరె స్టు చేసి పోలీసులు రిమాండ్ చేశారని, అలాగే ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్యాయత్నంకి పాల్పడేలా ప్రేరేపించిన తమ ఫిర్యాదులో పేర్కొన్న కురుమ సా యిబాబా, కురుమ పాపయ్యతో పాటు ఇతరులపై కేసులు నమోదు చేయకుండా పోలీ సులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.

వీరి పై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణ బందు నిర్వహిస్తామని అఖిలపక్షం నాయకులు తెలిపారు. సమావేశంలో అఖిలపక్షం నాయకు లు జనార్దన్ రెడ్డి, ఆదిమూలం సతీష్, పెద్ద ఎడ్ల నర్సింలు, చిరంజీవులు, పృథ్వీరాజ్, బర్కత్, అంజాగౌడ్ పాల్గొన్నారు.