18-12-2025 08:39:18 AM
- మండలంలో 85.80 శాతం పోలింగ్
జైపూర్,(విజయక్రాంతి): జైపూర్ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు, 186 వార్డులలో ఆరు వార్డులు ఏకగ్రీవం కాగా 180 వార్డులకు బుధ వారం ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మండలంలో 30,626 (15,278 పురుషులు, 15,347 మహిళలు, ఇతరులు ఒకరు) మంది ఓటర్లున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొమ్మిది గంటల వరకు 7,338 (23.96%), 11 గంటల వరకు 16,812 (54.89%), మధ్యాహ్నం ఒంటి గంట వరకు 25,333 (82.72%) పోలింగ్ జరిగింది. ఒంటి గంట తర్వాత పోలింగ్ కేంద్రాలలో క్యూలో నిలబడ్డ వారు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత 26,277 (85.80%) ఓట్లు పోలయ్యాయి. మొత్తం 20 జీపీలకు 81 మంది, 180 వార్డులకు 494 మంది పోటీపడ్డారు. ఇందారంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు.
ఎన్నికైన సర్పంచులు వీరే...
జైపూర్ మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు 81 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బెజ్జాల గ్రామ పంచాయతీ సర్పంచుగా వేముల స్రవంతి నర్సయ్య (కాంగ్రెస్), ఎల్కంటి సర్పంచుగా గుండెల్లి శ్రీనివాస్ రెడ్డి(కాంగ్రెస్), జైపూర్ సర్పంచుగా కూన భాస్కర్ (కాంగ్రెస్), నర్వా సర్పంచుగా ఆగిడి స్రవంతి లింగయ్య (కాంగ్రెస్), గంగిపల్లి సర్పంచుగా సుందిల్ల రాజేశ్వరి (కాంగ్రెస్), శెట్ పల్లి సర్పంచుగా జాగేటి సరస్వతి గోపాల్ (కాంగ్రెస్), వేలాల సర్పంచుగా డేగ స్వప్న నగేష్ (కాంగ్రెస్), కిష్టాపూర్ సర్పంచుగా దుర్గం మహేష్ (కాంగ్రెస్), కుందారం సర్పంచుగా కుక్కల వినోద కిష్టయ్య (కాంగ్రెస్), శివ్వారం సర్పంచుగా తాళ్లపల్లి అంజన్ గౌడ్ (కాంగ్రెస్), వెంకట్రావుపల్లి సర్పంచుగా జాడి లక్ష్మీ (కాంగ్రెస్), టేకుమట్ల సర్పంచుగా బల్ల వెంకటేష్ (కాంగ్రెస్), మిట్టపల్లి సర్పంచుగా తామర మనోహర్ (కాంగ్రెస్), ఇందారం సర్పంచుగా ఫయాజ్(ఇండిపెండెంట్), కాన్కూర్ సర్పంచుగా కొయ్యడ సాగరికి వెంకటేష్ గౌడ్ (ఇండిపెండెంట్), నర్సింగాపూర్ (ఎస్) సర్పంచుగా తుంగపిండి తిరుపతి (ఇండిపెండెంటు), పౌనూర్ సర్పంచుగా వేముల సుధా తిరుపతి గౌడ్ (ఇండిపెండెంటు), పెగడపల్లి సర్పంచుగా రామగిరి రాము (ఇండిపెండెంటు), రామారావుపేట సర్పంచుగా పులి రాజశేఖర్ (ఇండిపెండెంటు), ముదిగుంట గ్రామ సర్పంచుగా ఆకుల రవీందర్ (బీఆర్ఎస్)లు ఎన్నికయ్యారు.