calender_icon.png 25 November, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడి గుడ్ల సరఫరాలో.. కోట్ల స్కాం

25-11-2025 12:52:33 AM

అంగన్వాడీ కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా కోడిగుడ్ల సరఫరా

  1. ఏటా రూ. 43 కోట్లకుపైగా స్వాహా 
  2. కాలంచెల్లి కుళ్లిన, బరువులేని గుడ్ల పంపిణీ
  3. 50 గ్రాముల స్థానంలో.. 30 గ్రాములే 
  4. సరఫరాదారులకు కనకవర్షం

* రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లోని పేద వర్గాలకు చెందిన చిన్నారులకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. నిబంధనలు భద్రం గానే రూపొందించిన అధికారులు.. అవి అసలు అమలవుతున్నాయా అనేది పర్యవేక్షించకుండా మత్తులో జోగుతున్నారు. దీనితో చిన్నారులకు కనీ సం కోడిగుడ్లుకూడా సరిగా అందడం లేదు. ఇస్తున్న కోడిగుడ్లు కూడా నాణ్యతలేనివి, అతితక్కువ బరువుతో ఉన్నవి అంటగడుతున్నారు.

చాలాసార్లు కుళ్లిపోయినవి సరఫరా చేస్తుండటం గమ నార్హం. ఇలా నాణ్యతలేని, తక్కువ బరువు ఉన్న కోడిగుడ్ల ద్వారా యేటా సుమారు రూ. 43 కోట్లకుపైగా నిధులు పక్కదారిపడుతున్నాయంటే.. కోడిగుడ్ల సరఫరా వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోడిగుడ్ల సరఫరాదారులకు మూడో గ్రేడ్ కోడిగుడ్లు, బైబ్యాక్‌లో వచ్చిన కోడిగుడ్లు కనకవర్షం కురిపిస్తున్నాయి.

హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) :  అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు (3 నుంచి 6 సంవత్స రాలు) ప్రతిరోజూ కోడిగుడ్లను ఇవ్వడం ద్వారా ప్రొటీన్, కాల్షియంను అందించాలనేది ప్రభుత్వ ఆశయం. దీనితోపాటు తక్కువ బరువున్న  పిల్లలకు అదనంగా ప్రొటీన్, కాల్షియం అందించాలనే సదుద్దేశంతో నెలకు అదనంగా మరో 9 కోడిగుడ్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇలా మొత్తంగా రాష్ట్రంపై ప్రతిరోజూ సుమారు 12 లక్షల కోడిగుడ్లను సరఫరా చేయాల్సి ఉంది.

ఇందుకు అనుగుణంగా టెండర్లు పిలవాల్సిన సర్కారు.. జిల్లాల పరిధిలో ప్రతి 10 రోజులకు ఒకసారి అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లను సరఫరా చేసేందుకు వీలుగా కోడిగుడ్ల సరఫరాదారులతో చర్చించి.. కాంట్రాక్టును నామినేషన్‌పై అప్పజెప్పారు. రాష్ట్రంలో మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి.

ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 21,43,983 మంది గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇందులో 3,32,942 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా.. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు 9,53,834 మంది ఉన్నారు. అలాగే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలలోపు చిన్నారులు 8,57,206 మంది ఉన్నారు. పౌష్టికాహా రం అందించే క్రమంలో 8.57 లక్షల మంది చిన్నారులకు ప్రతిరోజూ ఒక్కొక్కరికీ ఒక్కొక్క కోడిగుడ్డు ఇస్తున్నారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ సరఫరా చేస్తున్న 12 లక్షల కోడిగుడ్ల పరిస్థితి అత్యంత దయనీయంగా కనపడుతోంది. నాణ్యతలేని,  బరువు తక్కువున్న కోడిగుడ్లను సరఫరా చేస్తుండటంతో.. ప్రొటీన్, కాల్షియం అందించాలన్న ప్రభు త్వ ఆశయానికి ఆరంభంలోనే తూట్లు పడుతున్నాయి. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి కోడిగుడ్డు సగటున 50 గ్రాముల బరు వు ఉండాలి. కానీ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు కేవలం 30 నుంచి 35 గ్రాముల బరువు మాత్రమే ఉం టున్నాయి.

పైగా ఇవికూడా చాలాసార్లు కుళ్ళిపోయి వస్తున్నాయి. ప్రతి పది రోజులకు ఒకసారి అంగన్వాడీ కేంద్రాలకు సర ఫరా చేయాల్సిన కోడిగుడ్లను.. నెలకు ఒకేసారి డంప్ చేస్తుండటంతో.. కాలం చెల్లిపో యి కుళ్ళిపోతున్నాయి. దీనితో ప్రొటీన్, కాల్షియం నిరుపేద చిన్నారులకు అందడం లేదు.. కానీ కోడిగుడ్ల సరఫరాదారులకు మా త్రం బాగానే గిట్టుబాటవుతోంది. ఇదం తా గమనించకుండా.. చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులకు ఆమ్యామ్యాలు అందుతున్నాయి. 

థర్డ్ గ్రేడ్.. కుళ్ళిపోయినవి..

వాస్తవానికి ప్రభుత్వం నిబంధనల ప్రకా రం 50 గ్రాముల బరువుండే కోడిగుడ్లు కా వాలంటే.. కోళ్లు మొదటగా పెట్టే గుడ్లు మా త్రమే ఆ బరువుతో ఉంటాయి. అటు తరువాత రెండో గ్రేడ్ గుడ్లు అంటే.. సగటున 40 గ్రాముల బరువుండేవి. ఇక మూడోతరగతి (థర్డ్ క్లాస్) గుడ్లంటే.. కోళ్ళు గుడ్లు పెట్టే కాలంలో చిట్టచివరి రోజుల్లో వచ్చేవి అన్నమాట. ఇవి కేవలం 30 నుంచి 35 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు.. ఈ థర్డ్ గ్రేడ్‌కు చెందినవి మాత్రమే.

ఇవి చాలా చిన్న గా ఉంటాయి. పైగా ప్రతి పది రోజులకు ఒకసారి సరఫరా చేయాల్సినవికాస్తా.. నెలకు ఒకేసారి సరఫరా చేస్తుండటంతో.. వారం, పది రోజుల్లోనే అవి కుళ్ళిపోతున్నాయి. దీ నితో కొన్నిసార్లు చిన్నారులకు గుడ్లు పెట్టడం లేదు. ఆ ఆరోపణలకు తావివ్వకుండా ఉండటానికి.. కుళ్ళిపోయిన గుడ్లనే చాలా వరకు అందిస్తున్నారనే ఆరోపణలు గ్రామాల్లోని తల్లిదండ్రుల నుంచే వస్తున్నాయి.

మొదటి గ్రేడ్‌లో ఉండే 50 గ్రాముల బరువుండే గుడ్లను కోళ్ళఫాం యజమానులు పెద్ద, పెద్ద మాల్స్, ప్రొవిజన్ స్టోర్స్ వారికి అమ్ముకుంటున్నారు. ఇక రెండో గ్రేడ్ కోడిగుడ్లను రిటైల్ షాపులు, కిరాణాషాపులకు సరఫరా చేస్తున్నారు. ఎటొచ్చీ.. మూడో గ్రేడ్ (30 నుంచి 35 గ్రాముల బరువు) కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు అంటగడు తున్నారు. ఇవి చాలా తక్కువ ధరకు వస్తుండటంతో.. కోడిగుడ్ల సరఫరాదారులుకూడా వీటినే కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో ఒక కోడిగుడ్డు రూ. 6.25 నుంచి రూ. 6.50 పైసల వరకు ఉం టోంది.

అదే మూడో గ్రేడ్ కోడిగుడ్డు కేవలం అందులో సగం ధర కన్నా తక్కువకే వస్తోం ది. పైగా పెద్దపెద్ద హోల్‌సేల్ దుకాణాలకు విక్రయించే కోడిగుడ్లను కాలం తీరిన తరువాత బైబ్యాక్ పద్ధతిలో సరఫరా చేస్తుం టారు. ఇలా కాలం చెల్లినవి బైబ్యాక్ పద్ధతి లో తిరిగొచ్చినవాటిని తక్కువ ధరకు అంగన్వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. పెద్ద సైజు లో ఉన్నప్పటికీ.. అవి కుళ్ళిపోయి వస్తున్నా యి. దీనితో కోడిగుడ్ల సరఫరాదారులకు మూడో గ్రేడ్ కోడిగుడ్లు, బైబ్యాక్‌లో వచ్చిన కోడిగుడ్లు కనకవర్షం కురిపిస్తున్నాయి.

పూర్తిగా సప్లు కాదు..

అంగన్వాడీలకు అవసరమైన మేర కోడిగుడ్డ సరఫరా జరుగుతున్నట్టు కనిపించినా, అందులో 10 నుంచి 20 శాతం వరకు తక్కువగానే సరఫరా అవుతుంటుంది. ఈ చిలక కొట్టుడు ఎవరికీ తెలియకుండా జరుగుతుందని అనుకోలేం. ఇలా చిలక కొట్టుడు ఎంత జరిగినా బిల్లుల్లో మాత్రం అవసరమైన మేర గుడ్లు సరఫరా జరుగుతున్నట్టే ఉంటుంది. ఇలా బోగస్ బిల్లులకు కొదువుండదు.

భాగస్వామ్యం ఉండాలి.. 

అంగన్వాడీలే కాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ పిల్లలు చదువుకొనే విద్యాలయాల్లో భోజనం, వసతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలించాల్సిన భాద్యతను ఆయా సంఘా లు కూడా తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు సంబంధించిన ఆహారాన్ని స రిగా అందిస్తున్నారా? లేదా? అదేది ఒక కన్నే సి ఉంచాల్సిన భాద్యత ఆయా సంఘాలపై కూడా ఉంది. ప్రభుత్వ పరంగా సీరియర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి, నిర్వహణ సరిగాలేనిపక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే అధికార యంత్రాం గం కుప్పకూలినట్లే భావించాల్సి ఉంటుంది. 

ఏటా రూ.43 కోట్లకుపైగా పక్కదారి..

టెండరు పిలిచి తక్కువ ధరకే సరఫరా చేసేవారికి కాంట్రాక్టు ఇవ్వాల్సిన అధికారులు.. జిల్లాల వారీగా కోడిగుడ్ల సరఫరాదారులతో చర్చించి.. నామినేషన్‌పై కాంట్రాక్టు అప్పగించడంతోనే కావాల్సిన తతంగం అంతా నడిచిందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, కోడిగుడ్ల సరఫరాదారుల మధ్య ఒక అంగీకారం ప్రకారం ముందుకు వెళు తున్నారని.. అందులోభాగంగానే నామినేషన్‌పై కాంట్రాక్టులు ఇచ్చారనే చెప్పాల్సి వస్తోంది.

ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు సుమారు 12 లక్షల కోడిగుడ్లు వినియోగిస్తున్నారు. ఒక్కో కోడిగుడ్డుపై అదనంగా ఒక రూపాయి మిగిలిందని అనుకున్నా.. ప్రతిరోజూ రూ. 12 లక్షలు.. ఇలా ఏడాదికి సుమారు రూ. 43 కోట్లకుపైగా అదనపు ఆదాయంగా మిగుల్చుకుంటున్నారంటే.. కోడిగుడ్ల పేరుతో ఎంత నొక్కేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

స్థానిక పౌల్ట్రీ రైతులకు అప్పగిస్తే..

నిజానికి ఒక్కో మండలంలో చాలా వర కు చిన్న పౌల్ట్రీతో ఉపాధి పొందే రైతులు చా లా మందే ఉంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వేల మంది చిన్న పౌల్ట్రీఫాం రైతులున్నారు. వీరితో మాట్లాడి ఆ మండలంలో కోడిగుడ్లను సరఫరాచేస్తే.. నాణ్య మైన, పెద్ద కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయొచ్చు. కానీ కోడిగుడ్లు అంటేనే.. ‘మామూలు’గా తీసుకునే అధికారులు.. సరఫరాదారులతో కుమ్మక్కు అయి.. నామినేషన్‌పై ఉత్పత్తిదారులు, వినియోగదారులకు మధ్యలో ఉండే సరఫరాదారులకు అప్పగించారు.

అలా కాకుండా నేరుగా ఉత్పత్తిదారులైన చిన్న పౌల్ట్రీ రైతులకు వీటిని అప్పగిస్తే.. నాణ్యమైనవి, మంచి కోడిగుడ్లు చిన్నపిల్లలకు అందించే అవకాశం ఉంటుందని, తద్వారా వారి ఆరోగ్యం బాగుంటుందని తల్లిదండ్రులుకూడా ఒప్పుకుంటున్నారు. దీనివల్ల స్థానిక చిన్న పౌల్ట్రీ రైతులకు మార్కెటింగ్ అవకాశం దక్కినట్టవుతుంది.. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన గుడ్లను ప్రతి 10 రోజులకు సరఫరా చేసే అవకాశమూ ఉంటుంది. వెరసి పేద చిన్న పిల్లలకు ప్రొటీన్, కాల్షియం ఉండే కోడిగుడ్లను అం దించనట్టూ అవుతుంది. ఈ దిశగా ప్రభు త్వం దృష్టి సారించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.