25-11-2025 12:24:43 AM
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి) : పంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణ యం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిం ది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ ఎన్నికల సం ఘానికి లేఖ రాసింది. ఈ మేరకు సోమవారం వివరాలను సమర్పించింది. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొంది.
అన్ని జిల్లా ల కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పించిన సర్పంచ్, వార్డు సభ్యుల గెజిట్లను ఎన్నికల సంఘానికి పంపింది. పాత రిజర్వే షన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గత రెండు రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ల రిజర్వేషన్లతో పాటు లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరగాల్సింది.
అయితే ప్రధా న న్యాయమూర్తి సెలవులో ఉన్నందువల్ల విచారణ జరగలేదు. మంగళవా రం విచారణ తర్వాత నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. రాష్ర్ట వ్యాప్తంగా 12,783 పంచాయతీల్లోని 1,12,288 వార్డుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ర్ట ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎస్‌ఈసీ రాణి కుముదిని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
హైకోర్టు విచారణపై ఆసక్తి
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో సోమవారం జరగాల్సిన విచారణను మంగళవారం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ అంశం నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది. అయితే స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం, ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది.
ఈ క్రమంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ అంశంలో హైకోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతోపాటు సోమవారం హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా మంగళవారం జరిగే క్యాబినెట్ భేటీలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ అన్యూహంగా చీఫ్ జస్టిస్ లేని కారణంగా హైకోర్టు తీర్పు వాయిదా పడింది.
దీంతో మంగళవారం హైకోర్టు విచారణ జరిపించే నేపథ్యంలో ఎలాంటి తీర్పు రాబోతుందో అని అంతా ఉత్కంఠ నెలకొన్నది. ఈ క్రమంలో నేడు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించనున్నదో అని బీసీలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.