calender_icon.png 25 November, 2025 | 12:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో కొన్ని నెలల్లోనే.. నోయిడాగా కొడంగల్

25-11-2025 12:39:19 AM

  1. నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ
  2. అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా లగచర్ల 
  3. ఇందిరమ్మ చీరెలు ప్రతీ ఆడబిడ్డకు చేరాలి
  4. కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  5. రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 
  6. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు

వికారాబాద్, నవంబర్- 24 (విజయక్రాంతి): కొన్ని నెలల్లోనే తెలంగాణ నోయి డాగా కొడంగల్ నియోజకవర్గాన్ని, అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా లగచర్లను తీర్చిదిద్దుతామని, త్వరలోనే కొడంగల్ రైల్వే పనులు ప్రారంభమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయ బోతున్నట్టు తెలిపారు. మూడు నెలల్లో కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందించి, లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకొస్తామన్నారు.

త్వరలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని, 3, 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలు పునిచ్చారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో రూ.103 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరితో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఉండాలని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ప్రతీ పేద తల్లి కళ్లల్లో ఆనందం చూడాలని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని పేర్కొన్నారు.

అదానీ అంబానీలతో పోటీ పడేలా సోలార్ ప్లాంట్స్ నిర్వహణ మహిళలకు అప్పగించామని వెల్లడించారు. మహిళలకు ఆర్థిక స్వా తంత్య్రం కల్పించడంతోపాటు హైటెక్ సిటీ శిల్పారామంలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశామని సీఎం వివరించారు. ఆడబిడ్డలు తయారు చేసిన ఉత్ప త్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకునేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు జరు పుతున్నామని తెలిపారు.

చదువుతోనే జీవితాల్లో వెలుగు

కొడంగల్ మండలం ఎంకేపల్లి గ్రామం లో అత్యాధునిక కేంద్రీకృత గ్రీన్‌ఫీల్ అక్షయపాత్ర కిచెన్ షెడ్డుకు సీఎం భూమి పూజ చేసి మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ విద్యార్థి కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చేస్తున్నామని, సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వా రా మధ్యాహ్న భోజనాన్ని అందించే కా ర్యక్రమం తీసుకున్నామని పేర్కొన్నారు.

జీవితాల్లో వెలుగులు నింపేందుకు మంచి చదు వు అందించడం ఒక్కటే మార్గమని, పిల్లలు గొప్పగా చదువుకుంటేనే తల్లితండ్రుల జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని చెప్పా రు. అందుకే అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కిచె న్ షెడ్డును ఏర్పాటు చేసి నాణ్యమైన భో జనం సరఫరా చేస్తున్నామని తెలిపారు. బి డ్డల గురించి కన్నతల్లి ఆలోచించినట్లుగా తమ ప్రభుత్వం ఆలోచించి, వారి ఆకలి తీరుస్తోందని తెలిపారు.

ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం

ఎడ్యుకేషన్, ఇరిగేషన్ శాఖలకు మొదటి ప్రాధాన్యమిస్తున్నామని సీఎం అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, వెటర్నరీ, అగ్రి, పారామెడికల్, నర్సింగ్, ఇంజ నీరింగ్ కళాశాలలు, ఏటీసీలను, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, సైనిక్ స్కూల్ తీసుకొచ్చామని, వి ద్య ఒక్కటే తరగని ఆస్తి అని చెప్పారు. రాష్ర్ట నలుమూలల నుంచి గొప్ప చదువుల కోసం కొడంగల్‌కు వెళ్లాలి అనేలా కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

16 నెలల్లో అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగ ల్‌ను మార్చాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. కొ డంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని, మూడేళ్లల్లో  ప్రాజెక్టు పూర్తి చేసి కొ డంగల్ భూములు కృష్ణా జలాలతో తడుపుతామని తెలిపారు. లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ పారిశ్రామిక వాడగా తీర్చి దిద్దుతామని, త్వరలోనే కొడంగల్ ప్రజ లు రైలు కూత వినబోతున్నారని చెప్పారు.

కొడంగల్ ప్రజల 70 ఏళ్ల కల నెరవేరబోతుందని, మరో తొమ్మిది నెలల్లో రైల్వే లైన్ ఏర్పాటు పనులు మొదలు కాబోతున్నాయని తెలిపారు. కొడంగల్ నియోజక వర్గంలో సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చే సుకోబోతున్నామని, అభివృద్ధిలో రాష్ట్రానికి ఒక మోడల్‌గా మారుస్తామని చెప్పారు.

ప్రతి ఆడబిడ్డకు చీర సారే చేరాలి

త్వరలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచే అవకాశముందని సీఎం రేవంత్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సూచించారు. ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న సారె ఇందిరమ్మ చీరలు అధికారులు ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాలని సీఎం తెలిపారు.

పదేళ్లు రాష్ర్టంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంటుందని, రాజకీయాలకు అతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు రావాలని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి ఆడబిడ్డలు అండగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.